Site icon NTV Telugu

Tripti Dimri : ఆ పాపులర్ మూవీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ..?

Whatsapp Image 2023 12 26 At 10.07.47 Pm

Whatsapp Image 2023 12 26 At 10.07.47 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరో గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఆ చిత్రం లో రణ్‍బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన తృప్తి..తన అందం తో ఎంతగానో ఆకట్టుకుంది.యానిమల్ సినిమా తో ఈ భామ నేషనల్ క్రష్ గా మారింది.. దీంతో తృప్తి తర్వాత చేసే సినిమాలపై ఆసక్తి నెలకొంది. కాగా, తృప్తి డిమ్రి కి తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టు సమాచారం.. బాలీవుడ్‍‍లో ఎంతో పాపులర్ అయిన ఆషికీ ఫ్రాంచైజీలో తదుపరి రానున్న ఆషికీ 3 మూవీలో హీరోయిన్‍గా తృప్తి డిమ్రికి అవకాశం దక్కిందని సమాచారం.ఆషికీ 3 చిత్రం లో కార్తీక్ ఆర్యన్ హీరో గా చేయనున్నారు. ఈ సినిమా లో కార్తీక్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‍గా నటించనున్నారని సమాచారం.

యానిమల్ సినిమా బంపర్ హిట్ తర్వాత తృప్తి డిమ్రి ఫుల్ పాపులరిటీ వచ్చింది.కార్తీక్ ఆర్యన్‍తో ఆమె నటిస్తే అద్భుతంగా ఉంటుందని ఆషికీ 3 మేకర్స్ కొంతకాలంగా అనుకుంటున్నారట. అయితే, ఈ విషయంపై కొన్ని రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్‍గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఆషికీ 3 చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా మ్యూజికల్ లవ్ స్టోరీగానే రూపొందనుంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన మ్యూజిక్ స్కోర్ క్రియేట్ చేస్తామని ఇటీవల అనురాగ్ బసు తెలిపారు.ఆషికీ 3 సినిమా షూటింగ్ 2024 మొదటి మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్ల గురించి మేకర్స్ ప్రకటించనున్నారు

Exit mobile version