NTV Telugu Site icon

Trinamool MP: ప్రధాని మోదీని అసురతో పోల్చిన టీఎంసీ ఎంపీ.. జైశంకర్‌పై మండిపాటు

Trinamool Mp

Trinamool Mp

Trinamool MP: తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ మంగళవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై విరుచుకుపడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని ‘అసుర’తో పోల్చారు. జై శంకర్‌ తండ్రి కే సుబ్రహ్మణ్యం ప్రధాని నరేంద్ర మోదీని అసుర అని సంబోధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు జవహర్‌ సిర్కార్‌ ట్విట్టర్‌ వేదికగా జైశంకర్‌ తండ్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. విమర్శలు గుప్పించారు. ఈ మేరకు జైశంకర్‌ తండ్రి కే.సుబ్రమణ్యం గుజరాత్‌ 2002 అల్లర్లల విషయంలో ధర్మ హత్య జరిగిందన్నారు. అమాయకులను రక్షించడంలో మోదీ విఫలమై అధర్మానికి పాల్పడ్డారన్నారన్నారు. కానీ ఆయన కొడుకు ఒక అసురుడిని సేవిస్తున్నందుకు సిగ్గుపడకుండా సరైన నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరానని గర్వంగా చెబుతున్నాడంటూ జైశంకర్‌పై సిర్కార్‌ మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. జైశంకర్‌ విదేశాంగ కార్యదర్శి నుంచి విదేశాంగ మంత్రి తన రాజకీయ జీవితం గురించి ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన తండ్రి కె సుబ్రహ్మణ్యంను కేంద్ర కార్యదర్శిగా తొలగించారని జైశంకర్ అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో తన తండ్రిని క్యాబినెట్ సెక్రటరీ పదవికి తన కంటే జూనియర్ ఎవరో నియమించారని విదేశాంగ మంత్రి తెలిపారు. కె సుబ్రహ్మణ్యం 1980లో డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా పనిచేశారు. 1980లో ఇందిరాగాంధీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తొలగించిన మొదటి కార్యదర్శి ఆయనే అని జైశంకర్ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే తాను బీజేపీలోకి ఎందుకు చేరానో కూడా వివరించారు. దీంతో తృణమాల్‌ కాంగ్రెస్‌ ఎంపీ జవహర్‌ సిర్కార్ విదేశాంగ మంత్రి మతిమరుపుతో బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

Read Also: CPI Narayana : అదానీ మాయల ఫకీరు కంటే దారుణంగా తయారయ్యాడు

నాడు తండ్రి చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి.. గాంధీలపై ఉన్న అక్కసును మరోసారి జైశంకర్‌ బయటపెట్టుకున్నారని జవహర్ సిర్కార్ మండిపడ్డారు. ఆయన బీజేపీకి విధేయతగా పనిచేసి అత్యున్నత పదవులను పొందారన్నారు. బీజేపీ పదవి ఇచ్చినందుకు ఆ పార్టీని తలకెక్కించుకుని జైశంకర్‌ ఇలా మాట్లాడుతున్నాడా అంటూ జైశంకర్‌కు జవహర్‌ సిర్కార్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.