Tribals Attack: ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన గ్రామాలకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు మంచిర్యాల జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ లోని ఇందన్ పల్లి అటవీ రేంజ్ పరిధిలోని కవాల్ సెక్షన్, సోనాపూర్ తండా బీట్ లోని పాలగోరీల ప్రాంతంలో అటవీభూమిని ఆక్రమించడానికి గుడిసెలు నిర్మించారు. అడవిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించమని సూచించిన అటవీ సిబ్బందిపై కారం చల్లుతూ, కర్రలతో ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు.
Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఫిక్స్.. ఎప్పుడంటే..!
ఈ దాడిలో అటవీ సెక్షన్ అధికారి రాజేందర్, బీట్ అధికారి సంతోష్ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మంచిర్యాలకు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై జన్నారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అధికారులు. అటవీ, వన్యప్రాణి చట్టాల ప్రకారం ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు అధికారులు. అటవీభూమి ఆక్రమణకు యత్నిస్తున్న వారికి అటవీభూమి ఆక్రమణ చేయవద్దని, ఒకవేళ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు గత రెండు, మూడు రోజులుగా వారికి గ్రామ పెద్దలు, సంఘ పెద్దల సహాయంతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
Bandi Sanjay : ట్విట్టర్ టిల్లు.. లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు.. బండి సంజయ్ కౌంటర్