Site icon NTV Telugu

Alluri Agency: అల్లూరి ఏజెన్సీలో బాహుబలి సీన్ రిపీట్.. బిడ్డను బుజాన ఎత్తుకుని పీకల్లోతు వాగు దాటిన గిరిజనుడు

Ap

Ap

బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కుండపోత వానలతో వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. బిడ్డను బుజాన ఎత్తుకుని పీకల్లోతు వాగు దాటాడు ఓ గిరిజనుడు. పెదబయలు పెదకొండపల్లి పంచాయితీ చెక్కరాయి వద్ద తన బిడ్డను బుజాన ఎక్కించుకొని పీకల్లోతు వాగు దాటాడు. వాగులోంచి సురక్షితంగా ఒడ్డుకు చేరారు తండ్రీ కొడుకులు.

Exit mobile version