NTV Telugu Site icon

Maryam Nawaz Sharif: ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీని తీవ్రవాద సంస్థగా పరిగణించాలి..

Pakistan

Pakistan

Maryam Nawaz Sharif: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎమ్‌ఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరారు. లాహోర్‌లో విలేకరుల సమావేశంలో మరియం నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థతో ప్రభుత్వం వ్యవహరించే విధంగానే పీటీఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌తోనూ వ్యవహరించాలని అన్నారు. “నిషేధిత సంస్థ, ఉగ్రవాద సంస్థపై ప్రభుత్వం, రాష్ట్రం ఎలా వ్యవహరిస్తుందో.. ఇమ్రాన్‌ఖాన్‌పై కూడా అదే విధంగా వ్యవహరించాలి. దానిని (పీటీఐ) రాజకీయ పార్టీగా భావించి, రాజకీయ పార్టీగా వ్యవహరించడం అంతం కావాలి.” అని ఆమె చెప్పింది.

Read Also: Himanta Biswa Sarma: అస్సాంలో మదర్సాలను మూసివేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తన వ్యూహాలన్నీ విఫలమైన తర్వాత పీటీఐ ఛైర్మన్ ఇప్పుడు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొంది. ఉగ్రవాదులతో ప్రభుత్వం వ్యవహరించే విధంగానే వారితోనూ వ్యవహరించాలని ఆమె అన్నారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసినందుకు మాజీ ప్రధానిపై ఆమె విరుచుకుపడ్డారు. తోషాఖానా కేసులో ఖాన్ అతని అరెస్టును ప్రతిఘటించడం, అతని జమాన్ పార్క్ నివాసం లోపల వందలాది మంది మద్దతుదారులు చుట్టుముట్టడంతో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. “విదేశీ నిధుల కేసు తరువాత ఇమ్రాన్ పాకిస్తాన్‌లో పౌర అశాంతి, అరాచకాలను వ్యాప్తి చేయడాన్ని ప్రారంభించాడనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు” అని మరియమ్ అన్నారు. ఉగ్రవాద సంస్థల్లో మాత్రమే గుహలో దాక్కుని ఆదేశాలు ఇవ్వబడుతాయని, జమాన్ పార్క్ వద్ద కూడా అదే జరుగుతోందని ఆమె అన్నారు. తోషాఖానా కేసులో ఖాన్‌ను అరెస్టు చేసేందుకు పాకిస్థాన్ పోలీసులు జమాన్ పార్క్‌లోని ఖాన్ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత పలు చోట్ల నిరసనలు చెలరేగాయి.