Australia Squad: భారత్ టీ20 సిరీస్ నుంచి ట్రవిస్ హెడ్ ఔట్.. కారణం అదేనా?
- నవంబర్ 6న నాలుగో టీ20 మ్యాచ్
- క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం
- భారత్ సిరీస్ నుంచి ట్రవిస్ హెడ్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోల్డ్‌కోస్ట్ వేదికగా నవంబర్ 6న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను ఆసీస్ జట్టు నుంచి రిలీజ్ చేశారు. 2025 షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని సీఏ ఆదేశించింది. రొటేషన్‌లో భాగంగా చివరి రెండు టీ20లకు విశ్రాంతిని ఇచ్చారు. అంతేకాదు 2025 యాషెస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా సీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ టీ20 సిరీస్‌లో సీనియర్లకు సీఏ అవకాశం ఇవ్వలేదు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కెమరూన్ గ్రీన్ ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. వీరందరూ షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడనున్నారు. టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన ట్రవిస్ హెడ్.. వరుసగా 8, 28, 29 పరుగులు చేశాడు. హెడ్ స్థానాన్ని ఏ ప్లేయర్ భర్తీ చేస్తారో చూడాలి. ఇక టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా, భారత్ 1-1 సమంగా ఉన్నాయి. దాంతో నాలుగో మ్యాచ్ కీలకంగా మారనుంది.
Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ఆస్ట్రేలియా టీమ్:
మిచెల్ మార్ష్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, మహ్లి బియర్డ్‌మన్, టిమ్ డేవిడ్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఇల్లిస్, బెన్ డ్వార్షుయిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా, జేవియర్ బార్ట్‌లెట్.
తాజావార్తలు
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!