ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. రెండో రోజు తొలి సెషన్ టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రాణించింది. తొలి సెషన్‌లో టీమిండియా 29.4 ఓవర్లు బౌలింగ్ చేసి 76 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. మూడు వికెట్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు లభించగా, నితీష్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి సెంచరీతో చెలరేగాడు. అతనితో పాటు స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా.. వికెట్ల కోసం భారత్ బౌలర్లు శ్రమిస్తూనే ఉన్నారు.
Read Also: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్ రెండో రోజు శుభారంభం చేసింది. 17వ ఓవర్‌లో ఉస్మాన్ ఖవాజా (21) క్యాచ్ అవుట్ రూపంలో ఔట్ చేయగా.. 19వ ఓవర్‌లో నాథన్ మెక్‌స్వీనీ (9) పెవిలియన్‌కు పంపాడు. నితీష్ రెడ్డి మార్నస్ లాబుషాగ్నే (12)ను పెవిలియన్ పంపాడు. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు234/3 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్లు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ వికెట్ పడకుండా ఓవర్‌కు 4.81 పరుగుల చొప్పున బ్యాటింగ్ చేశారు. ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 115 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్ టెస్టు క్రికెట్‌లో 9వ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌పై అతనికిది మూడో సెంచరీ.
Read Also: Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి!