NTV Telugu Site icon

Ramprasad Reddy: అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి కీలక సందేశం..

Ram Prasad

Ram Prasad

అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి 11:30 ప్రాంతంలో కడప నుంచి రాయచోటికి బయలుదేరిన ఇతియోస్ కారు.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మార్గమధ్యంలోని చిట్లూరు హరిజనవాడ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అఫ్రోజ్, అలీమ్ జితేంద్ర, అంజి నాయక్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. ఖాదర్ బాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!

కాగా.. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురి మృతదేహాలను సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా.. దహన సంస్కరాల కోసం మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

Chandrababu: ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సిద్ధం చేసుకున్న ఏపీ సీఎం..

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి-కడప మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరం, దురదృష్టకరం అని అన్నారు. మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు వల్లే సంభవిస్తున్నాయి.. దయచేసి ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కోరారు. చాలా చిన్న వయస్సు ఉన్న వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా వాహనాలను నడుపుతున్నారని.. వీటిని అరికట్టాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నాని తెలిపారు. రెండు చేతులు జోడించి అందరికీ ఒకటే చెబుతున్నా.. దయచేసి మద్యం తాగి వాహనాలను నడపరాదన్నారు. ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి రాదు.. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.