NTV Telugu Site icon

Vizag Capital: విశాఖ నుంచి పాలన దిశగా వేగంగా అడుగులు.. నేడు సీఎం జగన్‌కు నివేదిక

Ys Jagan

Ys Jagan

Vizag Capital: విశాఖపట్నం నుంచి పాలన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. దీనికి సంబంధించి విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది.. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆ నివేదిక సమర్పించనుంది కమిటీ.. విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ పరిశీలనకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం న నియమించిన విషయం విదితమే కాగా.. విశాఖలో పర్యటించిన త్రిసభ్య కమిటీ.. తాత్కాలిక కార్యాలయాల కోసం అనువైన భవనాలను పరిశీలించింది.. దీనిపై నివేదిక సిద్ధం చేసింది.. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి నివేదిక సమర్పించనుంది ఆ కమిటీ..

Read Also: Telangana Rains: రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి

కాగా, విశాఖ నుంచి పాలన సాగించేందుకు సిద్ధమైన వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీనియర్‌ కార్యకర్తలకు వసతి సహా విశాఖపట్నంలో అనువైన రవాణా వసతిని గుర్తించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ (MA & UD డిపార్ట్‌మెంట్), స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్) మరియు సెక్రటరీ (సర్వీసెస్ & హెచ్‌ఆర్‌ఎం), జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, కార్యాలయాలకు అనువైన రవాణా వసతిని గుర్తించి, నివేదికను సిద్ధం చేసింది.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామంటూ.. తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతూ వస్తున్నారు.. మంత్రులు కూడా ఇదే మాట పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. కానీ, అది కాస్త ఆలస్యం అవుతూ రాగా.. ఇప్పుడు నివేదిక పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. కాగా, వైఎస్‌ జగన్‌ సర్కా్ర్‌ విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా నిర్ణయించిన విషయం విదితమే.