NTV Telugu Site icon

Transgender love story: ప్రేమలో మోసపోయిన ట్రాన్స్ జెండర్.. 73 మంది అబ్బాయిలపై ప్రతీకారం!

Japan

Japan

ప్రేమలో విఫలమయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్రెకప్ సర్వసాధారణంగా మారింది. బ్రెకప్ అనంతరం ప్రేమలో పడకపోవడమే మంచిది అని చెబుతుంటారు. ప్రేమలో గాయపడిన వ్యక్తులు వివిధ పద్ధతులను అనుసరిస్తారు. చాలా మంది ఈ షాక్ నుంచి కోలుకుని తమ జీవితాల్లోకి తిరిగి రాగా.. మరి కొందరు దానిని మరచిపోయి ముందుకు సాగుతున్నారు. ఓ ట్రాన్స్ జెండర్ మాత్రం పెద్ద ఎత్తుగడ వేసింది.

READ MORE: Dunzo: ఏకంగా 75 శాతం ఉద్యోగులను తొలగించిన డన్జో..

ప్రేమలో మోసపోయిన ఓ ట్రాన్స్‌ జెండర్‌ మహిళ ప్రతీకారం తీర్చుకునేందుకే వేసిన స్టెప్ అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఈ ఘటన సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇది జపాన్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ కథ. జపనీస్ వ్యక్తితో ఓ ట్రాన్స్ జెండర్ ప్రేమలో పడింది. ఆ వ్యక్తి ఆమెను మోసం చేశాడు. అయితే దీని తర్వాత ట్రాన్స్‌జెండర్ మహిళ వింత ప్రమాణం చేసింది. తరువాతి 13 సంవత్సరాలలో.. ఆమె 73 మంది జపనీస్ పురుషులను ట్రాప్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది.

READ MORE:Minister Thummala: వందేళ్లలో రాని వరద.. ఖమ్మం జిల్లాలో 48 వేల ఎకరాల్లో పంట నష్టం

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం… ఈ జెండర్ జపనీస్ వ్యక్తి మోసం చేశాడు. ఆ తర్వాత ఆమె జపనీస్ పురుషులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. 13 ఏళ్లలో మొత్తం 73 మంది జపనీస్ వ్యక్తులను మోసం చేసి రూ.7 కోట్ల 38 లక్షలకు పైగా కాజేసింది. ఆగస్ట్ 4న 49 ఏళ్ల మహిళా ట్రాన్స్ జండర్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వివరాలను ఛేదించారు. ట్రాన్స్ జెండర్ హాంకాంగ్ నుంచి వచ్చిన టూరిస్ట్ అని చెప్పి 36 ఏళ్ల జపాన్ వ్యక్తిని ట్రాప్ చేసింది. డాక్యుమెంట్లు పోయాయనే సాకుతో డబ్బులు అడిగింది. నిరాకరించడంతో ఆపై బంగారు వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత బంగారం అమ్మి డబ్బు తీసుకుని పారిపోయింది. బ్యాంకాక్‌లో పట్టుకున్నప్పుడు పేరు ఉథాయ్ నంతఖాన్ అని తెలిసింది. ఇంటరాగేషన్‌లో తాను చేసిన మోసం, ప్రతీకారం గురించి మొత్తం చెప్పింది. కాలేజీ రోజుల్లోనే ప్రేమలో మోసపోయానని, గత 13 ఏళ్లుగా జపాన్‌ అబ్బాయిలపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దాదారు 73 మందిని మోసం చేసినట్లు ఒప్పుకుంది.