Site icon NTV Telugu

Anaya Bangar: “నేను మహిళల క్రికెట్‌కి అర్హురాలిని” ట్రాన్స్ ఉమెన్ అనయ బంగార్ సంచలనం..!

Anaya Bangar

Anaya Bangar

Anaya Bangar: మాజీ భారత క్రికెటర్ సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగార్ (ఆర్యన్) తన ట్రాన్స్‌ ఉమెన్ గా చేసిన ప్రయాణాన్ని పంచుకుంది. అలాగే ఐసీసీ, బీసీసీఐ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ, తాను మహిళల క్రికెట్‌కు అర్హురాలినని తెలిపింది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

Read Also: Pakistan: “డొనాల్డ్ ట్రంప్‌- ఆసిమ్ మునీర్ లంచ్”.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు..

అనయా తన హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) పూర్తి అయినా ఏడాదికి తరువాత మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ సహకారంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీటిలో కండర శక్తి, స్థైర్యం, గ్లూకోజ్ లెవల్స్, ఆక్సిజన్ వినియోగం వంటి అంశాలను మహిళా అథ్లెట్లతో పోల్చారు. పరీక్ష ఫలితాల ప్రకారం, అనయా శరీర సంబంధిత అన్ని ప్రమాణాలు ప్రస్తుతం మహిళా అథ్లెట్ల శారీరక ప్రమాణాల శ్రేణిలోనే ఉన్నాయని తేలింది.

Read Also: M.Tech To Thief: ఎం.టెక్ వరకు చదివి దొంగగా మారిన ఐటీ ఇంజనీర్.. కారణం ఇదే..!

ఇందుకు సంబంధించి వీడియోలో అనయా మాట్లాడుతూ.. మొదటిసారిగా నా శారీరక మార్పుల శాస్త్రీయ నివేదికను పంచుకుంటున్నాను. గత ఏడాదిలో నేను హార్మోన్ థెరపీ అనంతరం శాస్త్రీయంగా నిర్మితమైన శరీర పరీక్షలు చేయించుకున్నాను. ఇది ఊహలు కాదు, అభిప్రాయాలు కాదు, ఇది నిఖార్సైన డేటా అంటూ పేర్కొన్నారు. అలాగే ఈ నివేదికను నేను పూర్తి పారదర్శకతతో బీసీసీఐ, ఐసీసీకి సమర్పిస్తున్నాను. నా ఉద్దేశం ఎవరి ఆగ్రహం రేపడం కాదు, వాస్తవాల ఆధారంగా చర్చ ప్రారంభించడం మాత్రమే. విభజన చేయడం కాదు, అవకాశాలు కల్పించడం నా లక్ష్యం అంటూ సంచలన కామెంట్స్ చేస్తుంది.

వీడియోకి అనయా పెట్టిన క్యాప్షన్‌లో “సైన్స్ చెబుతోంది నేను మహిళల క్రికెట్‌కి అర్హురాలిని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ప్రపంచం ఈ వాస్తవాన్ని వినడానికి సిద్ధంగా ఉందా?” అని పేర్కొన్నారు. ప్రస్తుతం, ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లకు మహిళల క్రికెట్‌లో పాల్గొనటానికి ఐసీసీ అనుమతి ఇవ్వడం లేదు. 2023 క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిషేధం అమలులోకి వచ్చింది. అనయ గత సంవత్సరం హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీతో పాటు జెండర్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్ లో నివసిస్తున్నారు.

Exit mobile version