తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్-2 పరిధిలోని వారిని బదిలీ చేశారు. ప్రధానంగా నల్లగొండ జిల్లా వారిని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకి, మేడ్చల్ జిల్లా నుంచి జనగామ, మేడ్చల్ నుంచి రంగారెడ్డికి, సూర్యాపేట జిల్లా నుంచి జనగామ, వనపర్తి జిల్లా నుంచి నాగర్ కర్నూలుకు, వికారాబాద్ జిల్లా నుంచి నాగర్ కర్నూలుకు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి, గద్వాలకు, సంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్ నగర్, వికారాబాద్‌కి బదిలీలు చేశారు.
Read Also: Canada: కెనడా భారతీయుడికి జైలు శిక్ష.. మానవ అక్రమ రవాణా కేసులో శిక్ష ఖరారు
అంటే సొంత జిల్లాల్లో తహశీల్దార్లు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించకుండా రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత తహశీల్దార్లలో కొందరు మాత్రం బదిలీ కాలేదు. దానిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ప్రస్తుత పోస్టు నుంచి మరో స్థానానికి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది.. కానీ వారు అదే స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. వారికి మినహాయింపు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అవి నగర శివారులోని మండలాలు కావడంతో ఇప్పటికే పలు అనుమానాలకి దారి తీస్తున్నాయి. ఇక, తెలంగాణలో ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ బదీలీలు జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Taapsee : ఆ విషయంలో హీరోయిన్స్ నే ఎందుకు తప్పుబడతారు..
