ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు అయ్యారు. మొత్తంగా 21 మంది ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్లు బదిలీలు అయ్యారు. బదిలీల్లో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గా వైజాగ్ జేసీ విశ్వనాథ్ నియామకం అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ గా పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ప్రవీణ్ ఆదిత్ నియామకం అయ్యారు.
Read Also: AP Politics: రాజకీయాల నుంచి జయదేవ్ వైదొలగడంపై తల్లి అరుణకుమారి ఏమన్నారంటే..!
శ్రీకాకుళం కలెక్టర్గా జిలానీ సమూన్.
తిరుపతి కలెక్టర్గా లక్ష్మీషా.
నంద్యాల కలెక్టర్గా కె. శ్రీనివాసులు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్గా అభిషిక్త కిషోర్.
మున్సిపల్ శాఖ డైరెక్టర్గా బాలాజీరావు.
హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా వెంకట రమణా రెడ్డి.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనరుగా తమీమ్ అన్సారీయా.
పార్వతిపురం-మన్యం జిల్లా జేసీగా అంబేద్కర్.
విపత్తు నివారణ శాఖ డైరెక్టర్గా రోణంకి కూర్మనాధ్.
జీవీఎంసీ అదనపు కమిషనరుగా విశ్వనాధం.
విశాఖ జిల్లా జేసీగా మయూర్ అశోక్.
ప్రకాశం జేసీగా రోణంకి గోపాల కృష్ణ.
కాకినాడ జేసీగా ప్రవీణ్ ఆదిత్య.
పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా ఇళక్కియా.
సర్వే సెటిల్మెంట్స్ అదనపు డైరక్టరుగా ఆర్ గోవింద రావు.
విజయనగరం జిల్లా జేసీగా కార్తీక్.
అల్లూరి జిల్లా జేసీగా భావ్నా.
ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీగా హరిత.
నెల్లూరు జేసీగా ఆదర్శ్ రాజీందరన్.
తిరుపతి మున్సిపల్ కమిషనరుగా అదితీ సింగ్.
పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ సెక్రటరీగా రేఖారాణి.