Site icon NTV Telugu

Corpse In Toilet: టాయిలెట్‌లో మృతదేహం.. 900 కిలోమీటర్లు ప్రయాణించిన రైలు

Train Toilet

Train Toilet

Corpse In Toilet: రైలులోని టాయిలెట్‌లో చనిపోయిన ఓ వ్యక్తిని ఎవరూ గుర్తించకపోవడంతో మృతదేహంతోనే రైలు దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉత్తరప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌లోని రోజా స్టేషన్‌లో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అమృత్‌సర్ వెళ్తున్న సహర్స-అమృతసర్ జన్‌సేవా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. టాయిలెట్ నుంచి దుర్వాసన వస్తోందని ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రైలు బీహార్‌లోని బన్మంఖి నుంచి వస్తూ 900 కిలోమీటర్లు ప్రయాణించినా టాయిలెట్‌లో వ్యక్తి చనిపోయిన ఉన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. సాధారణ రైలు కంపార్ట్‌మెంట్‌లోని కొంతమంది ప్రయాణికులు వాష్‌రూమ్ నుండి దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేయడం ప్రారంభించిడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

చివరికి రోజా స్టేషన్‌లో జీఆర్‌పీ సిబ్బంది టాయిలెట్‌ తాళాల్ని పగలగొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో రైలు దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. బాధితుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో గుర్తించడం కష్టమవుతోందని పోలీసులు తెలిపారు. బాధితుడు గ్రీన్ షర్ట్, బ్లూ ప్యాంట్ ధరించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇతర స్టేషన్లకు చేరవేసినట్టు పోలీసులు తెలిపారు. బీహార్ నుంచి రైలు బయలుదేరడానికి రెండు రోజుల ముందు ఆ వ్యక్తి రైలు ఎక్కి, డోర్ లాక్ చేసి లావెటరీలోనే చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దుర్వాసన వస్తున్నట్టు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ఆదివారం బలవంతంగా టాయ్‌లెట్ తలుపులు తెరిచామని రైల్వే పోలీసు అధికారి రామ్ సహాయ్ పేర్కొన్నారు.

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు

బన్మింఖి నుంచి బయలుదేరిన రైలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా మీదుగా దాదాపు 35 గంటలు ప్రయాణించి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుతుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో చనిపోయిన వ్యక్తిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైలును ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో దాదాపు ఐదు గంటలపాటు నిలిపివేశారు. మృతుడు టాయిలెట్‌కి వెళ్లిన అనంతరం కోమాలోకి జారిపోవడంతో మరణించినట్లు రైల్వే ఆసుపత్రి వైద్యుడు సంజయ్ రాయ్ వెల్లడించారు. ఆ వ్యక్తి గురించి వివరాలు తెలుసుకోవడానికి అన్ని స్టేషన్లలో పోస్టర్లు వేశారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పదివేల మృత దేహాలు క్లెయిమ్ చేయబడకుండా, గుర్తించబడకుండా పోతున్నాయి. మరణించిన వారి స్నేహితులు లేదా బంధువులను గుర్తించే ప్రయత్నాలను అనుసరించి మూడు రోజుల తర్వాత వారిని సాధారణంగా పోలీసులు దహనం చేస్తారు.

Exit mobile version