NTV Telugu Site icon

Train Incident: ఎందుకురా ఇలా చేస్తున్నారు.. మరోమారు రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు

Train

Train

Train Incident: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ రైలు పట్టాలపై ఇనుప రాడ్‌ పెట్టి రైలును బోల్తా కొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ విషయంపై రైల్వే, గ్వాలియర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన గురించి బిర్లా నగర్ రైల్వే స్టేషన్, గ్వాలియర్ రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు రైలు సంబంధిత అధికారులు. రైల్వే సిబ్బందితో పాటు గ్వాలియర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి గుర్తు తెలియని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read Also: Minister Komatireddy: రైతులకు గుడ్‌ న్యూస్.. వారంలోపు మిగిలిన వారందరికీ రుణమాఫీ!

ఇక మరోవైపు ప్యాసింజర్ రైలును పట్టాలు తప్పించే కుట్రలో భాగంగా.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ దగ్గర జగత్‌పూర్-దరియాపూర్ స్టేషన్ మధ్య బెనికామా గ్రామ సమీపంలో సిమెంట్ స్లీపర్‌ను పూడ్చిపెట్టారు. అయితే., ప్యాసింజర్ రైలు కంటే ముందే గూడ్స్ రైలు వచ్చింది. ఇది గమనించిన లోకో పైలట్‌ బ్రేక్‌ వేసి రైలును నిలిపివేశాడు. దింతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంలో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఝాన్సీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ప్రయాగ్‌రాజ్ రాజేష్ కుమార్ కుష్వాహ మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న సిమెంట్ స్లీపర్‌లన్నింటినీ తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. లక్నో స్థాయి నుంచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్‌ఎం శర్మ తెలిపారు.