Son Kills Father in Vikarabad: తండ్రి కనిపించే దేవుడు. పిల్లల్ని చిన్నపటి నుంచి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తాడు. రాత్రింబవళ్లు కష్టపడుతూ.. తన కొడుకుకు మంచి భవిష్యత్తు అందరిచాలనే లక్ష్యంతో కృషి చేస్తాడు. తాను ఎలాంటి బట్టలు వేసుకున్నా పర్వాలేదు.. తన కొడుకు మాత్రం మంచి దుస్తులు ధరించాలని, తన కుమారుడికి సమాజంలో మంచి గుర్తింపు లభించాలని ఆశిస్తుంటాడు. లాంటి గొప్పి తండ్రిని ఓ కొడుకు కడతేర్చాడు. కన్నతండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి హనుమంతు (70)కు ఐదు గురు కొడుకులు. మూడో కుమారుడు రవి తండ్రి హనుమంతు దగ్గరే ఉంటున్నారు. రవికి ఇద్దరు పిల్లలు.
READ MORE: Independence Day: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక అక్కడే..!
రవి భార్య ఆరు ఏళ్ల కిందట మృతి చెందింది.. పిల్లలు సైతం రవి వద్దే ఉంటున్నారు. అతడు రోజు కూలీ పని చేసేవాడు.. తండ్రి హనుమంతు గత మూడు సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానపడ్డాడు.. దీంతో రవి తండ్రికి సేవలు చేస్తూ.. ఉండేవాడు. రవికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో మద్యం మత్తులో కొన్ని రోజుల నుంచి తల్లి, తండ్రితో గొడవకు దిగేవాడు. బుధవారం మద్యం మత్తులో ఇంట్లో మంచంపై ఉన్న తండ్రి చంపేశాడు. తలపై బలమైన ఆయుధం (సుత్తె అని సమాచారం)తో దాడి చేసి హత్య చేశాడు.. నిందితుడు రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
READ MORE: World Bank Warning : 2030లో ఉద్యోగాలకు క్లైమేట్ షాక్.. భారత్ కు వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక
