Site icon NTV Telugu

Hyderabad: ఉరేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య.. ఎందుకంటే..?

Susaide

Susaide

హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరూ మైనర్లు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన బాలికలుగా పోలీసులు గుర్తించారు. మృతుల పేర్లు వినీల (17), అఖిల (16). వినీల ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకొచ్చారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రెయిలింగ్‌కి చున్నీతో ఉరి వేసుకున్నారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.

READ MORE: Vasamsetti Subhash: జగన్‌కు లండన్‌ మందులు పనిచేయడంలేదు.. యోగా ప్రాక్టీస్‌ చేస్తే బెటర్..!

Exit mobile version