Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: అద్భుతం.. ఇనుము కరిగింది కానీ, కానీ క్షేమంగా ఉన్న భగవద్గీత..!

Bhagavad Gita

Bhagavad Gita

Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి జరిగిన ఘోరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే AI-171 ఫ్లైట్, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే నియంత్రణ తప్పి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనానికి ఢీకొని పేలిపోయింది. ఈ విషాద సంఘటనలో మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం తర్వాత జరిగిన రేస్క్యూ ఆపరేషన్ సమయంలో రక్షణ సిబ్బందికి ఒక అపూర్వమైన దృశ్యం కనిపించింది. మంటలు విమానం ఇనుమును కరిగించే స్థాయిలో ఉన్నా, ఆ మంటల మధ్య భగవద్గీత పూర్తిగా క్షేమంగా ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Also: Gautam Gambhir: జట్టును వదిలేసి భారత్ కు చేరుకున్న టీమిండియా కోచ్.. ఎందుకంటే..?

విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు తనతో పాటు తీసుకెళ్లిన ఈ పవిత్ర గ్రంథం, విమానంలోని మనుషులు, అన్ని వస్తువులు తగలబడిపోయిన ఆ తరువాత కూడా పవిత్ర గ్రంథం భగవద్గీతకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా గమనించిన ప్రజలు ఇది ఒక దైవ సంకేతంగా భావిస్తున్నారు. మంటలు, పేలుళ్ల మధ్యన కూడా భగవద్గీత అలానే ఉండటం, ధర్మం పట్ల విశ్వాసం కలిగించే సంఘటనగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి విమాన శకలాల వద్ద భగవద్గీత పేజీలను చూపిస్తున్నాడు. చుట్టూ దగ్ధమైన పదార్థాల మధ్యన పాడవని భగవద్గీత పుస్తకం చూసినవారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.

Read Also: Plane Crash: ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వైద్య విద్యార్థి..

ఈ ఘోరమైన ప్రమాదం నుండి రమేష్ విశ్వాశ్‌కుమార్ అనే ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతను సీటు నం. 11A, అంటే అత్యవసర ద్వారానికి దగ్గరగా కూర్చున్నాడు. సకాలంలో స్పందించి విమానం కూలకముందే బయటకు దూకడం వల్ల అతను ప్రాణాలతో బయటపడగలిగాడు. ఇది విన్నవారి గుండెల్లో భయాన్ని కలిగించినప్పటికీ అతని తెలివితేటలు అతని ప్రాణాన్ని నిలబెట్టాయి.

Exit mobile version