BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి
- పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం
- పూణేలో బీటెక్ విద్యార్థి మృతి
- టోలానీ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణేలో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుష్-అప్స్ చేస్తుండగా బాస్కెట్‌బాల్ హూప్ అతనిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆరోగ్య పరిస్థతి విషమించడంతో సెకండ్ ఇయర్ బీ.టెక్ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విశాల్ వర్మ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం టోలానీ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్వేతా ఖేడ్కర్ హామీ ఇచ్చారు.
Also Read
ఈ సంఘటన పూణేలోని తలేగావ్‌లోని ఇండోరి ప్రాంతంలో జరిగింది . నివేదికల ప్రకారం, విశాల్ వర్మ బాస్కెట్‌బాల్ కోర్ట్ లో రింగ్‌పై పుష్-అప్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బరువైన ఇనుప రింగ్ అకస్మాత్తుగా విరిగి అతని తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కారణంగా స్పృహ కోల్పోయాడు. అనంతరం తలేగావ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స అనంతరం వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరిగిందని విద్యార్థులు ఆరోపించారు.
Also Read:కిడ్నీ రాళ్లు కరిగించాలా? ఈ డైట్ తప్పనిసరి!
ఈ ఘటన అనంతరం టోలానీ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఘటనా స్థలానికి భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా ఖేడ్కర్ తెలిపారు.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!