Site icon NTV Telugu

Tragedy : కుక్కల నుంచి తప్పించుకోబోయి ట్రాక్టర్‌ కింద పడ్డ బాలుడు

Dogs Attack

Dogs Attack

హన్మకొండ కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో మంగళవారం జరిగిన తెలంగాణ విద్యా దినోత్సవం వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ విద్యా దినోత్సవం పండుగ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో 6వ తరగతి విద్యార్థి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన హృదయ విదారకంగా మారింది.

Also Read : Minister KTR : విద్యతోనే వికాసం… ఆనందం

విద్యా దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో జయపాల్ కుమారుడు ఇనుగాల ధనుష్ (10) తన తోటి విద్యార్థులతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా, రోడ్డు పక్కన ఉన్న కుక్క ఒక్కసారిగా ధనుష్‌పై దాడికి ప్రయత్నించింది.

Also Read : Most Wanted Smuggler: పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్.. పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాందాస్..!

ఊహించని సంఘటనతో ఆశ్చర్యపోయిన బాలుడు కుక్క నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, అయితే అతను ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చక్రం కిందకు వచ్చాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Exit mobile version