కొద్ది సేపటి లో ఇంటికి వెళ్లాల్సిన మహిళా కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి వెళ్ళింది… మొదటి సారిగా రామాలయం వద్ద వున్న స్లుయిస్ లో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది.. భద్రాచలం పట్టణంలోని రామాలయం వద్ద జరిగిన ఘోర ఘటన… కేటీఆర్ పర్యటన కోసం ఏర్పాట్లు కు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ మృత్యు వాత పడింది. భద్రాచలం అన్నదానం వద్ద డ్రైనేజీ కాలువ లో పడి కొత్తగూడెం కు చెందిన మహిళా కానిస్టేబుల్ మృతి చెందింది. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న శ్రీదేవి అనే హెడ్ కానిస్టేబుల్ భద్రాచలంలో కేటీఆర్ పర్యటన డ్యూటీ పడింది.. శ్రీదేవి భర్త రామారావు కూడా కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఈ రోజు కేటీఆర్ పర్యటన సందర్భంగా డ్యూటీ వేశారు.
Also Read : Tollywood Shootings: పబ్బులో శర్వానంద్, స్పెషల్ సెట్టులో మహేష్ బాబు..షూటింగ్ అప్డేట్లు ఇవే!
అయితే భద్రాచలంలో భారీ వర్షం పడింది.. దీంతో.. ఈ వర్షం వల్ల భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాలలో వరద నీరు చేరుకుంది. వరద నీరు అంతా నాళా నుంచి కరకట్టకు చేరుకుంటుంది. అక్కడ నుంచి స్లుయిస్ ద్వారా గోదావరిలో కలుస్తుంది. డ్యూటీ పని అయన తరువాత రామాలయం వద్ద నుంచి వస్తుండగా నాలాలో జారింపడింది శ్రీదేవి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు నాలా పొంగడం కామన్ అయితే ఈ ప్రాంత వాసులకు ఇది బాగా తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలియని శ్రీదేవి నాలలో జారీ పడింది.. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్ లు రంగాం లోకి దిగారు.. వరద తీవ్రత బాగా ఎక్కువగా వుండడం తో నాలలోనే కొట్టుకుని పోయింది. కరకట్ట వద్ద slooyis వద్ద చిక్కుకుని పోయింది. దీంతో గజ ఈతగాళ్లను రంగం లోకిందించారు.. మృత దేహాన్ని బయటకు తీశారు.
Also Read : Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. టెన్నిస్‌లో పతకం