పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎంజాయ్ చేద్దామనుకున్న వారి సంతోషం నీటిలో కలిసిపోయింది. ముందు ముందు మంచి చదువులు చదువుకుని పైస్థాయికి ఎదగాలన్న కన్నవారి కలలు కలగానే మారిపోయాయి. ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మరణంతో తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నారు.
Read Also: Zomato: జొమాటోకు జీఎస్టీ భారీ షాక్.. నోటీసులో ఏముందంటే..!
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా రూరల్ మండలం పచ్చనపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారుల ఈత సరదా గ్రామాన్ని శోక సముద్రంలో ముంచింది. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఈత సరదా కోసం సమీపంలోని చెరువుకు వెళ్లారు. అయితే.. చెరువులో బురద ఎక్కువగా ఉండటంతో అందులో చిక్కుకుని ఇద్దరు బాలురు సంజయ్(15), ఆకాష్ (15) మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు.. చెరువు వద్దకు వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేక పోయింది. ఒకే గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: AP Schools: స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. రోజుకు 3సార్లు వాటర్ బెల్