Crime News: హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కలకలం సృష్టించింది. ఉస్మాన్ నగర్ కు చెందిన మామా జఫర్ కుమారుడు పైసల్ ఈనెల 12న అర్ధరాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి ఉస్మానియా హోటల్ వెళుతున్నాను అని చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి అతడి కోసం వెతికారు.
Read Also: Road Accident: కుప్పంలో ఘోర రోడ్డుప్రమాదం…ముగ్గురు వైద్యవిద్యార్ధులు మృతి
ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో మర్డర్ జరిగినట్లు సమాచారం అందింది. హంతకుడు అంతకుడు జబ్బార్(17)గా పోలీసులు గుర్తించాడు. ఇతడు వృత్తిరీత్యా కాస్మెటిక్ సేల్స్ చేస్తుంటాడు. మినర్ కాలనీకి చెందిన వాడు. షాహిన్ నగర్లో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Scissors in Stomach: కడుపులో కత్తెర మర్చిపోయిన డాక్టర్లు.. ఆరేళ్లుగా మహిళకు నరకం