Site icon NTV Telugu

Palnadu Crime: పండుగపూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Rangareddy Crime

Rangareddy Crime

Palnadu Crime: పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.. అనారోగ్యంతో ఓ వృద్ధుడు కన్నుమూస్తే.. మద్యం సేవించి కుమారుడు, అతడి బామ్మర్ది గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట మండలం చామర్రు గ్రామంలో గౌతుకట్ల కోటయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడు అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు.. అయితే, అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మద్యం కొనుగోలు చేశారు మృతుని కుమారుడు నాగేశ్వరరావు, అతను బామ్మర్ది తెల్ల మేకల నాగేశ్వరరావు.. మద్యం సేవించి ఆ ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.. గంట వ్యవధిలో ఇరువురూ ప్రాణాలు విడిచారు.. దీంతో.. పండగ పూట ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో చామర్రులో విషాదం నెలకొంది.. అయితే, మద్యంలో గౌతుకట్ల నాగేశ్వరరావు, తెల్లమేకల నాగేశ్వరరావు ఎలుకల మందు కలుపుకుని తాగారనే ప్రచారం గ్రామంలో గుప్పుమంటోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Read Also: Rahul Gandhi: జాతీయ జెండాకు నమస్కరించని ఆర్ఎస్ఎస్.. దేశం గురించి మాట్లాడుతుంది..

Exit mobile version