Site icon NTV Telugu

Ramantapur: విషాదం మిగిల్చిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. కరెంట్ తీగలు తాకి ఐదుగురు మృతి!

Ramanthapur

Ramanthapur

Ramantapur: హైదరాబాద్‌ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహ శోభాయాత్రలో రథం విద్యుత్ తీగలకు తాకడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Weather Update: తడిసి ముద్దైన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు!

ఈ ప్రమాదంలో కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39) మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రాత్రి 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా కొనసాగిన యాత్ర అర్థరాత్రి 12.30 సమయంలో యాదవ సంఘం దగ్గరికి చేరింది. ఈ సమయంలో రథాన్ని లాగుతున్న జీప్ మొరాయించడంతో నిర్వాహకులు చేతులతో రథాన్ని తోసారు. కొద్ది దూరం వెళ్ళగానే రథం పైభాగం విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది.

LIC Recruitment 2025: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.లక్షన్నర జీతంతో ఎల్ఐసీలో ఉద్యోగాలు!

దానితో రథాన్ని పట్టుకున్న వారు కింద పడిపోయారు. అదే సమయంలో పై నుంచి నిప్పురవ్వలు రాలినట్లు సాక్షులు వివరించారు. వెంటనే క్షతగాత్రులను పక్కకు లాగి వారికి CPR చేశారు. అనంతరం పోలీసుల సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఐదుగురు మరణించారు. అయితే, ఇక్కడ అద్భుతం ఏమిటంటే.. ఈ ప్రమాదంలో రథంపై ఉన్న పూజారి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. రథంలోని ఇనుప భాగాన్ని పట్టుకున్న వారికే కరెంట్ షాక్ తగలడంతో ప్రాణనష్టం సంభవించిందని సాక్షులు తెలిపారు. శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలలో ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చివరగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version