Site icon NTV Telugu

Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి!

Ganesh Immersion

Ganesh Immersion

Ganesh Immersion: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

PM Manipur Visit: మణిపూర్‌కు ప్రధాని మోడీ.. 2023 తర్వాత ఇదే తొలి పర్యటన

మృతులను తూర్పు తాళ్ళు గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి, జి మురళి, ఇమన సూర్యనారాయణ, దినేష్ గా గుర్తించారు. మరో ఇద్దరిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Anti-Immigration Rally: ఆస్ట్రేలియాలో భారతీయులకు వ్యతిరేకంగా నిరసన..

Exit mobile version