Site icon NTV Telugu

Warangal: నేడు వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic

Traffic

గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు భక్తులు రెడీ అయ్యారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథులను శుక్రవారం సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ ప్రాంతంలో 14 చెరువులు, వరంగల్‌లో 7 తటాకాలలో నిమజ్జనం జరగనుంది. శోభయాత్ర జరిగే రహదారుల పొడవునా విద్యుత్‌ లైట్లు అమర్చారు. బారికేడ్లతో పాటు 28 క్రేన్లు, తెప్పలు సిద్ధంగా ఉంచారు. అందుబాటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.

Also Read:USA: “భారతీయుల వల్లే ఉద్యోగాలు కోల్పోతున్నాం”.. యూఎస్ ఇన్‌ఫ్లూయెన్సర్ల బలుపు మాటలు..

వరంగల్ నగరంలో నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని నలుగురు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీ లు, 53 మంది ఇన్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్సైలతో పాటు 2100 పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

Also Read:Ambanti : తురకపాలెంలో ముప్పై మంది చనిపోవడం బాధాకరం

ట్రాఫిక్ ఆంక్షలు

ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ, సీపీఓ, అంబేడ్కర్‌ సెంటర్‌, ఏషియన్‌ శ్రీదేవి మాల్‌ మీదుగా బస్టాండ్‌ చేరుకోవాలి
హనుమకొండ బస్టాండ్‌ నుంచి బయలుదేరి ములుగు, కరీంనగర్‌ వెళ్లాల్సిన బస్సులు వయా ఏషియన్‌ శ్రీదేవి మాల్‌, అంబేడ్కర్‌ సెంటర్‌, సీపీఓ ద్వారా కేయూసీ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి
హనుమకొండ బస్టాండ్‌ నుంచి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు వయా బాలసముద్రం, అదాలత్‌, హంటర్‌ రోడ్డు మీదుగా వెళ్లాలి
వరంగల్‌ బస్టాండ్‌ నుంచి హనుమకొండ వైపు నకు వచ్చే బస్సులు చింతల్‌బ్రిడ్జి నుంచి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్‌ పంప్‌ సెంటర్‌, ఉర్సు గుట్ట, అదాలత్‌, బాలసముద్రం మీదుగా హనుమకొండకు చేరుకోవాలి
కాజీపేట నుంచి వరంగల్‌ వైపు వెళ్లాల్సిన కార్లు, ఇతర చిన్న వాహనాలు ఫాతిమా జంక్షన్‌, వడ్డేపల్లి చర్చి, కేయూసీ జంక్షన్‌, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు, ఎంజీఎం, జెమిని, పోతన జంక్షన్‌, అండర్‌ బ్రిడ్జి, హెడ్‌ పోస్టాఫీస్‌, వరంగల్‌ బస్టాండ్‌, వెంకట్రామ మీదుగా ప్రయాణించాలి.
వరంగల్‌ నుంచి కాజీపేట వైపు వెళ్లాల్సిన వాహనాలు వెంకట్రామ, వరంగల్‌ బస్టాండ్‌, హెడ్‌ పోస్టాఫీస్‌, అండర్‌ బ్రిడ్జి, పోతన జంక్షన్‌, జెమిని, ఎంజీఎం, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్‌, వడ్డేపల్లి చర్చి, ఫాతిమా జంక్షన్‌ మీదుగా ప్రయాణించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు.

Exit mobile version