Traffic Restrictions in Vijayawada: రంజాన్ మాసంలో వరుసగా విఫ్తార్ విందులు నడుస్తున్నాయి.. రాజకీయ పార్టీలు, ప్రముఖులు కూడా ఇఫ్తార్‌లు ఇస్తున్నారు.. ఇక, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇఫ్తార్ విందులు ఇస్తూ వస్తున్నాయి.. ఈ రోజు విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రానున్నారు.. ప్రభుత్వ ఇఫ్తార్ విందు నేపథ్యంలో బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని బెజవాడ పోలీసులు తెలిపారు..
విజయవాడ వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందుకు ఉర్పాట్లు చేసింది.. సాయంత్రం ఈ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకాబోతున్నారు.. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరనున్న ఆయన.. సాయంత్రం 5.45 గంటలకు విద్యాధరపురంలోని మినీ స్టేడియానికి చేరుకుంటారు. ఇక, సాయంత్రం 5.45 గంటల నుంచి 7.15 గంటల వరకు ఇఫ్తార్‌లో పాల్గొనబోతున్నారు సీఎం.. ఆ తర్వాత రాత్రి 7.30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు..
అయితే, ఇఫ్తార్ విందు, సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు బెజవాడ పోలీసులు.. జోజినగర్ జంక్షన్ నుండి సితార సెంటర్ వరకు మరియు సితార సెంటర్ నుండి జోజినగర్ జంక్షన్ వరకు ఎటువంటి వాహనాలకు ఈ సమయంలో ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.. నగర పోలీసు కమిషనర్ కేఆర్ టాటా.. ఇక, గొల్లపూడి వై జంక్షన్ నుండి సితార, చిట్టినగర్ వైపు వచ్చే అన్ని వాహనాలను అట్కిన్సన్ స్కూల్ రోడ్డు వద్ద నుంచి కబేలా వైపు వెళ్లాలని సూఏచించారు.. చిట్టినగర్ వైపు నుంచి గొల్లపూడి, హెచ్‌బీ కాలనీ, ఊర్మిళానగర్ వైపు వెళ్లే వాహనాలను సితార జంక్షన్ వద్ద కుమ్మరిపాలెం లేదా కబేళా వైపు మళ్లిస్తారు. మరోవైపు, ఇఫ్తార్ విందుకు ప్రముఖులు హాజరుకానుండడంతో.. ఇప్పటికే పాస్‌లు జారీ చేశారు.. పాస్ హోల్డర్లు మరియు వారి వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ స్థలాలు కేటాయించారు.. అందులో ఏ1 పాస్ హోల్డర్లు వీఎంసీ స్టేడియం వరకు వెళ్లే అవకాశం ఉండగా.. ఆ వాహనాలను విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో పార్క్ చేయాల్సి ఉంటుంది.. ఇక, ఇఫ్తార్ కోసం వచ్చే ముస్లిం సోదరులు సితార సెంటర్ వద్దకు వచ్చి తమ వాహనాలను వీఎంసీ స్టేడియం ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది..
