Site icon NTV Telugu

Traffic Alert: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Hyd

Hyd

Traffic Alert: ఇవాళ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పాత బస్తీతో పాటు మాసబ్‌ ట్యాంక్‌, మీరాలం దర్గా, లంగర్‌హౌజ్‌ దగ్గర ట్రాఫిక్‌ మళ్లీంపులు ఉంటాయని తెలిపారు. ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే ఈ రూట్లలో అనుమతి ఇవ్వనున్నారు. నేటి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

Read Also: Finger Ring Missing Case: వేలి రింగ్‌ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సీఐని ఏ2గా చేర్చాలని కోర్టు ఆదేశాలు..

కాగా, బహదూర్ పురా క్రాస్ రోడ్స్, పురానా పూల్, కామతి పూరా, కిషన్ బాగ్ వైపు నుంచి ప్రార్థనకి వచ్చే వెహికిల్స్ ను మాత్రమే అనుమతి ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందుకోసం జూపార్క్, మసీదు అల్లా హు అక్బర్ ఎదురుగా తమ వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. బక్రీద్ పండగ రోజు కావడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచనలు చేశారు. కాగా, బక్రీద్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిటైల్ బీఫ్ దుకాణాలను సోమ, మంగళవారాల్లో మూసివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు.

Exit mobile version