Site icon NTV Telugu

Hyderabad: వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic

Traffic

Traffic restrictions: హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఏఆర్ పెట్రోల్ బంక్ కూడలి నుంచి బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు వచ్చే వాహనాలను నాంపల్లి లేదా రవీంద్ర భారతి వైపు మళ్లీంచనున్నారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వెహికిల్స్ ను బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు వచ్చేందుకు అనుమతి లేదని చెప్పారు. గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ నుంచి సుజాత స్కూల్, చాపెల్ రోడ్డు వైపు పంపించనున్నారు. ట్యాంక్‌బండ్ నుంచి బషీర్‌బాగ్ కూడలి వైపు వచ్చే వెహికిల్స్ లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్ నగర్ వైపుకు వెళ్లనున్నాయి.

Read Also:Prabhas: దేవా కాదు దేవరథ… ఆ ఒక్క సీన్ పూనకాలు తెప్పిస్తుంది

కాగా, మరో వైపు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేడు ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ లోతుకుంట, టి.జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్, తిరుమలగిరి ఎక్స్‌ రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్‌ ఇన్ గేట్, టివోలి కూడలి, ప్లాజా ఎక్స్ రోడ్, సీటీఓ, ఎస్‌బీఐ జంక్షన్, రసూల్‌పుర, పీఎన్‌టీ పైవంతెన, గ్రీన్‌ ‌ల్యాండ్, మొనప్ప కూడలి, ఖైరతాబాద్ పీవీ విగ్రహం జంక్షన్ దగ్గర, పంజాగుట్ట, ఎన్ఎఫ్‌సీఎల్ ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టుల దగ్గర ట్రాఫిక్ నిలిపివేయనున్నారు.

Exit mobile version