Site icon NTV Telugu

Medaram Jatara: రేపు మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ విషయం తెలుసుకోండి

Medaram Jatara 2025

Medaram Jatara 2025

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మొక్కితే వరాలిచ్చే వనదేవతలైన సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికే మేడారానికి క్యూ కట్టారు. మరి మీరు కూడా రేపు మేడారానికి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీకోసమే.. రేపు ఎల్లుండి మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారంలో రేపు క్యాబినెట్ మీటింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎల్లుండి పునర్నిర్మాణం చేసిన వన దేవతల గద్దెలను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Also Read:Indian Rupee Fall: కరెన్సీ మార్కెట్‌ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం! రీజన్స్ ఇవే..

రేపు సీఎం పర్యటన సందర్భంగా మేడారంలో భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. వరంగల్ నుండి వచ్చే వారు ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారానికి చేరుకోవాలని సూచించారు. తాడ్వాయి మీదుగా వాహనాలకు నో ఎంట్రీ అని తెలిపారు. తిరుగుప్రయాణం బయ్యాక్కపేట భూపాలపల్లి పరకాల గుండెప్పాడ్ మీదుగా వరంగల్ చేరుకోవాలని తెలిపారు.
సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి కేకాన్ సుధీర్ రామనాథ్ హెచ్చరించారు.

Exit mobile version