Traffic Restrictions in Eluru: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు అనగా 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభ.. సిద్ధంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని తన నుంచి బయలుదేరి దెందులూరు చేరుకుంటారు. అక్కడ జరిగే ‘సిద్ధం’ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు అధికారులు..
* వైజాగ్ వైపు నుంచి విజయవాడ, చెన్నై వైపు వెళ్లే వాహనాల విషయానికి వస్తే..
1. కత్తి పూడి జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లిస్తారు.. గొల్లప్రోలు-కాకినాడ-అమలాపురం-చించినాడ-బ్రిడ్జి-నర్సాపురం-మొగల్తూరు-మచిలీపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
2. పెరవలి/సిద్దాంతం వద్ద ట్రాఫిక్ మళ్లించబడుతుంది.. దీంతో.. పెనుగొండ-పాలకోల్లు నరసాపురం మొగల్తూరు మీదుగా వాహనదారులు వెళ్లాలి.
3. తూడేపల్లిగూడెం/తణుకు వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు.. భీమవరం నర్సాపురం-మొగల్తూరు – లోసరి వంతెన మీదుగా వెళ్లాలి.
* వైజాగ్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల విషయానికి వస్తే..
1. దేవరపల్లి వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.. దేవరపల్లి – గోపాలపురం – కొయ్యలగూడెం- జంగా రెడ్డి గూడెం- జీలుగుమిల్లి- అశ్వారావు పేట- సత్తుపల్లి ఐరా – ఖమ్మం మీదుగా వెళ్లాలి.
2. తాడేపల్లిగూడెం నుండి నల్లజర్ల – కొయ్యలగూడెం-టి.పి. గూడెం – జీలుగుమిల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
3. నారాయణపురం వద్ద కూడా ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు అధికారులు వెల్లించారు.
* నెల్లూరు నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలు..
1. ఒంగోలు వద్ద మళ్లింపు ఉంటుంది.. తోవగుంట- బాపట్ల – చీరాల – రేపల్లె – అవనిగడ్డ – మచిలీపట్నం – చించినాడ- రాజోలు-అమలాపురం – కాకినాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
2. ఎనికే పాడు వద్ద ట్రాఫిక్ మళ్లిస్తారు.. 100′ రోడ్డు-మచిలీపట్నం హైవే మీదుగా వెళ్లాలి.
3. హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లిస్తారు.. నూజివీడు – రామన్నపేట్ అడ్డా రోడ్డు- ధర్మాజీగూడెం మీదుగా వెళ్లాలి.
* హైదరాబాద్ నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనదారులు
1. సూర్య పేట వద్ద ట్రాఫిక్ మళ్లిస్తారు..
2. చిల్లకల్లు వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు.. ఐరా-అశ్వారావుపేట – దేవరపల్లి మీదుగా ఆ ట్రాఫిక్ వెళ్లాల్సి ఉంటుంది.
3. ఇబ్రహీంపట్నం వద్ద ట్రాఫిక్ మళ్లిస్తారు.. మైలవరం – తిరువూరు – వి.ఎన్. బంజారా – సత్తుపల్లి మీదుగా వాహనదారులు వెళ్లాలి..
సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వాహనాలు ఏలూరు మీదుగా కాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రయనించాల్సిందిగా, ఆలాగే దారి మళ్లింపును గమనించి వాహనదారులు పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు సహకరించవలసినదిగా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఓ ప్రకటన విడుదల చేశారు.