CP Ranganath : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ జోడో యాత్ర రేపు హైదరాబాద్ లో జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. అయితే.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 కిలోమీటర్లు పొడవునా రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతుందని, దీంతో ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు ఉంటాయని గమనించగలరని మనవి చేశారు. మధ్యాహ్నం 3 గంటలు నుండి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆయన వెల్లడించారు. పురాణాపుల్ , ముసబౌలి, లాడ్ బజార్, చార్మినార్ మీదుగా పాద యాత్ర కొనసాగునుందని, చార్మినార్ వద్ద పతాకాన్ని ఎగరవేస్తారన్నారు. సౌత్ జోన్ లో 3 గంటలు నుండి ఆరు వరకు ట్రాఫిక్ ఉంటుందన్న సీపీ.. అఫ్జల్ గంజ్, మొహంజాయి మార్కెట్, గాంధీ భవన్, పోలీస్ కంట్రోల్ రూమ్, రవీంద్ర భారతీ, ఆర్బీఐ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మీదుగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.
Also Read : Manickam Tagore : రాహుల్ గాంధీకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది
ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, పాదయాత్ర జరిగే మూడు కిలో మీటర్ల రేడియస్ లో ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలన్నారు. ఆర్టీసీ బస్సులను సైతం డైవర్ట్ చేస్తున్నామని, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించాలని చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పలు నియోజకవర్గలనుండి చాలా మంది కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులకు పార్కింగ్ లు కేటాయించామని, రెండు సెంటర్లు చార్మినార్, అలాగే ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన వివరించారు. చార్మినార్ వద్ద మూడు గంటలు నుండి ప్రోగ్రాం మొదలవుతుందని, ఐమాక్స్ వద్ద 8.30 గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్, వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. రేపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నామన్నారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!