Site icon NTV Telugu

CP Ranganath : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Diversion

Traffic Diversion

భారత్ జోడో యాత్ర రేపు హైదరాబాద్ లో జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. అయితే.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 కిలోమీటర్లు పొడవునా రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతుందని, దీంతో ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు ఉంటాయని గమనించగలరని మనవి చేశారు. మధ్యాహ్నం 3 గంటలు నుండి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆయన వెల్లడించారు. పురాణాపుల్ , ముసబౌలి, లాడ్ బజార్, చార్మినార్ మీదుగా పాద యాత్ర కొనసాగునుందని, చార్మినార్ వద్ద పతాకాన్ని ఎగరవేస్తారన్నారు. సౌత్ జోన్ లో 3 గంటలు నుండి ఆరు వరకు ట్రాఫిక్ ఉంటుందన్న సీపీ.. అఫ్జల్ గంజ్, మొహంజాయి మార్కెట్, గాంధీ భవన్, పోలీస్ కంట్రోల్ రూమ్, రవీంద్ర భారతీ, ఆర్‌బీఐ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్‌ మార్గ్, ఐమాక్స్ మీదుగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.

Also Read : Manickam Tagore : రాహుల్ గాంధీకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది
ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, పాదయాత్ర జరిగే మూడు కిలో మీటర్ల రేడియస్ లో ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలన్నారు. ఆర్టీసీ బస్సులను సైతం డైవర్ట్ చేస్తున్నామని, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించాలని చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పలు నియోజకవర్గలనుండి చాలా మంది కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులకు పార్కింగ్ లు కేటాయించామని, రెండు సెంటర్లు చార్మినార్, అలాగే ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన వివరించారు. చార్మినార్ వద్ద మూడు గంటలు నుండి ప్రోగ్రాం మొదలవుతుందని, ఐమాక్స్ వద్ద 8.30 గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్, వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. రేపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నామన్నారు.

Exit mobile version