NTV Telugu Site icon

Traffic Diversion : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Divertion

Traffic Divertion

Traffic Diversion in Hyderabad due bibi ka alam.

హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. మొహర్రం సంతాప దినంలో భాగంగా డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం నుంచి ఊరేగింపు సాగనుంది. పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీబీ కా ఆలం దబీర్‌పురా నుండి మసీదు-ఇ-ఇలాహి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు సాగుతుంది. అయితే.. ఈ మార్గంలో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయని పోలీసులు వెల్లడించారు. ఊరేగింపు బీబీ కా ఆలం – షేక్ ఫైజ్ కమాన్, యాకుత్‌పురా రోడ్, ఎతేబార్ చౌక్ – అలీజా కోట్లా- చార్మినార్ – గుల్జార్ హౌజ్, పంజేషా, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ – మీర్ ఆలం మండి- దారుల్షిఫా మైదానం – అజఖానా-ఎ- జోహ్రా, కాలీ ఖబర్ కొనసాగి మస్జిద్-ఇ-ఇలాహి చాదర్‌ఘాట్ దగ్గర ముగుస్తుంది. ఊరేగింపు మార్గంలో వాహనాలను అనుమతించబోమని, ప్రజలు తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసుల కోరారు. వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.