Site icon NTV Telugu

Ragi Ambali: ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే ‘రాగి అంబలి’.. ఇలా చేస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

Ragi Ambali

Ragi Ambali

Ragi Ambali: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి మనం రకరకాల కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు తాగుతుంటాం. కానీ, మన పూర్వీకులు వేసవిలో ఒంటిని చల్లబరచడానికి, శరీరానికి అపరిమితమైన శక్తిని ఇవ్వడానికి రాగి అంబలిని వాడేవారని ఎంత మందికి తెలుసు. ముఖ్యంగా పులియబెట్టి చేసే ఈ రాగి అంబలి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియస్తే ఆశ్చర్యపోతారు. ఈ అమృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Operation Octopus: 16 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల గర్జన.. 100 మందికి పైగా సైబర్ కేటుగాళ్లు అరెస్ట్!

రాగి అంబలి తయారీ విధానం:
ఒక మట్టి కుండలో అర కప్పు రాగి పిండి, అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా (కనీసం 8-10 గంటలు) చల్లని ప్రదేశంలో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పిండి పులిసి ఔషధ గుణాలు వస్తాయి. తర్వాతి రోజు ఉదయం, స్టవ్ మీద కుండలో ఒక లీటర్ నీటిని మరిగించాలి. ఎసరు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా గరిటతో తిప్పాలి. సన్నటి సెగపై 10-15 నిమిషాల పాటు బబుల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆపై స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.

ఒక కప్పు పెరుగును సాఫ్ట్‌గా చిలికి, అందులో 3-4 కప్పుల నీళ్లు పోసి మజ్జిగ తయారు చేయాలి. ఇందులోకి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచి వేయాలి. అలాగే కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు (బ్లాక్ సాల్ట్ ఉంటే ఇంకా మంచిది) కలపాలి. చల్లారిన రాగి జావలో, అప్పుడే తయారు చేసుకున్న మజ్జిగను వడకట్టి కలపాలి. చివరగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి సర్వ్ చేస్తే అమోఘమైన రాగి అంబలి రెడీ అయిపోతుంది.

అద్భుత ప్రయోజనాలు ఇవే..
* ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
* పిండిని రాత్రంతా పులియబెట్టడం వల్ల ఇందులో పొట్టకు మేలు చేసే ‘గుడ్ బ్యాక్టీరియా’ పెరుగుతుంది. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు మటుమాయమవుతాయి.
* రాగుల్లో ఉండే కాల్షియం, ఐరన్ ఇతర పోషకాలు శరీరానికి ఉక్కు వంటి బలాన్ని ఇస్తాయి.

READ ALSO: Marriage Frauds : హైదరాబాద్‌లో బయటపడ్డ షాదీ డాట్ కామ్ మోసగాడు, కిలేడీ పాస్టర్ లీలలు!

Exit mobile version