రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. అయితే కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా ట్రాక్ దాటుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ట్రాక్ మధ్యలో చిక్కుకుంది. ఇదే సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ దూసుకొచ్చింది. అయితే లోకో పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. ఆకస్మాత్తుగా ట్రైన్ ఆగగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read:Plane Crash: విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా ఎందుకు పాల్గొంటోంది?
శుక్రవారం పాట్నా-గయ రైల్వే లైన్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ గయా నుంచి పాట్నాకు వెళుతుండగా, కడౌనా సమీపంలోని అక్రమ క్రాసింగ్ గుండా సిమెంట్ లోడ్ తో ట్రాక్టర్ వెళుతుండగా, అది ట్రాక్ మధ్యలో చిక్కుకుంది. ఇది చూసిన రైలు లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపాడు. సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read:Honeymoon Murder Case: నాలుగో ప్రయత్నంలో భర్తని చంపిన భార్య సోనమ్..
కానీ అప్పటికే ట్రాక్టర్ డ్రైవర్ ఇంజిన్‌తో పారిపోయాడు. కానీ ట్రాలీ మాత్రం పట్టాలపై అలాగే విడిచి వెళ్లాడు. పోలీసులు జెసిబి సహాయంతో సిమెంట్ లోడ్ చేసిన ట్రాక్టర్ ట్రాలీని తొలగించారు. ట్రాక్టర్ ట్రాలీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా, ట్రాక్టర్ యజమానిని గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
