NTV Telugu Site icon

Revanth Reddy : సెప్టెంబర్ 1 నుండి ఇంటింటికి కాంగ్రెస్

Revanth Reddy

Revanth Reddy

మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు ప్రజా సమస్యలు చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. కొందరు నేతలు పార్టీ మారుతూ పార్టీపై అనవసర విమర్శలు చేస్తున్నారు ఆయన మండిపడ్డారు. ప్రజా ప్రతినిధుల కొనుగోలు కోసం టీఆర్ఎస్, బీజేపీలు కమిటీలు వేసాయని, మునుగోడులో నేతల కొనుగోలు పక్రియ జరుగుతుందన్నారు. మునుగోడులో నాయకుల జేబులు నిండాయి తప్ప.. ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదంటూ ఆయన ఆరోపించారు. డిండి ప్రాజెక్టు ఆలస్యం అవ్వడం వల్ల, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల నల్లగొండ జిల్లా కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టం చేసాయని ఆయన విమర్శించారు.

 

సెప్టెంబర్ 1న మునుగోడు ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం..అదే రోజు ఇంటి ఇంటికి ప్రచారం మొదలు పెడతామని, ప్రభుత్వ కార్యక్రమాలు కాస్తా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు గా మారుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యక్రమానికి, ప్రభుత్వ కార్యక్రమానికి తేడా లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు కలెక్టరేట్ లు ప్రారంభిస్తే నన్ను ఆహ్వానించలేదని, నిన్న పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభిస్తే.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఆహ్వానించకపోగా..హౌస్ అరెస్ట్ చేసారంటూ రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Show comments