Site icon NTV Telugu

Mahesh Kumar Goud : రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలకు ధీటుగా కుల గణన జరగాలని దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని భారత్ జోడో నుండి చాటుతున్న మహనుభావుడన్నారు. అందుకే చంపేస్తామని బెదిరిస్తున్నారని, బీసీ ల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. రాహుల్ గాంధీ చెప్పినట్టు జిస్కి జిత్ని అబాధి , ఉస్కి ఉత్ని బాగేదారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో brs ఎందుకు 42 శాతం నుండి 23 శాతం కు బీసీ కోటా తగ్గించారు..ముందు సమాధానం చెప్పాలన్నారు మహేష్‌ కుమార్ గౌడ్‌. దమ్ముంటే ఒక బీసీ బిడ్డను మీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసే దమ్ము ఉందా అని, బీజేపీ బండి సంజయ్ ఆక్టీవ్ గా పనిచేసే బీసీ ను ఎందుకు తొలగించారన్నారు.

Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటాడు.. జాగ్రత్త బాసూ!

అంతేకాకుండా..’రెండు క్యాబినెట్ లలో సంజయ్ కి సహాయ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు.. అది రేవంత్ రెడ్డి కి బీసీ కుల గణన అంశం పై కమిట్మెంట్ ఉంది. రేవంత్ రెడ్డి , నేను ,పొన్నం ప్రభాకర్ అంత రాహుల్ గాంధీ సైనికులం.. బీసీ కుల గణన జరగనిదే ఎన్నికలకు పోము అని చర్చిస్తునం.. బీసీ కుల గణన కాంగ్రెస్ పేటెంట్. సీతక్క ,ప్రభాకర్ మేము ముఖ్యమంత్రి తో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ఆలోచన తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పాం. కేటీఆర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే విగ్రహం తీస్తాం అంటున్నారు..మీరు అధికారంలోకి వచ్చేది కల.. బీసీ ల రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా .కేటీఆర్’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

CM Revanth Reddy : మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి… ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు

Exit mobile version