NTV Telugu Site icon

TPCC Mahesh Goud : తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. గేమ్‌ ఛేంజర్‌గా తెలంగాణ మారబోతుంది

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

TPCC Mahesh Goud : రాష్ట్రానికి ఏడాది కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ గా మారిందన్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, గతంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు… పనులు కూడా ప్రారంభించాయన్నారు. ఫోర్త్ సిటీ లోకి పెట్టుబడులు రాబోతున్నాయి.. గేమ్ ఛేంజర్ గా తెలంగాణ మారబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి… సంక్షేమమని, 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్… ఫాం హౌస్ కి పరిమితం అయ్యారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు 25 వేల కోట్లే అని, రెండేళ్లలోనే లక్ష 78 వేల కోట్లు తెచ్చింది మా ప్రభుత్వమని ఆయన ఉద్ఘాటించారు. కళ్లు ఉండి చూడలేని పార్టీ ప్రతిపక్షం అని ఆయన మండిపడ్డారు.

Puducherry : సోషల్ మీడియాలో అవమానానికి ప్రతీకారం… బాంబుతో స్కూల్ కి వెళ్లిన విద్యార్థి

పటాన్ చెరు వ్యవహారంపై మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని, పార్టీ కార్యకర్తల పై కేసులు పెట్టే అంశం పైనా కమిటీ పరిశీలిస్తుందన్నారు. మహిపాల్ రెడ్డి వ్యాఖ్యల పైనా కమిటీ పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు. పఠాన్ చెరులో కొత్త పాత నాయకుల మధ్య ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, గ్రామ సభలకు విషయంలో అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు. నిజమైన పేద వారికే లబ్ది కావాలనేది ప్రభుత్వం ఉద్దేశమని, యూత్ కాంగ్రెస్ గొడవ లో ఉన్న వారందరికి షోకాజు లు ఇచ్చామన్నారు. ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక పైన కసరత్తు మొదలైందన్నారు. లిస్ట్ రెడీ చేసి హై కమాండ్ కి పంపిస్తాము.. త్వరలో అభ్యర్థి ప్రకటన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే బుధవారం నుండి మంత్రుల ముఖాముఖి ఉంటుందని, బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది అంతే అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.

Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్న‌త స్థానాల్లో తెలుగు వారు!