Site icon NTV Telugu

Revanthreddy : ఫుట్ బాల్ ఆడిన రేవంత్.. “కేసీఆర్ ఖేల్ ఖతం”

Revanth Reddy

Revanth Reddy

రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటే రేవంత్ రెడ్డి కాసేపు సరదాగా ఫుట్ బాల్ గేమ్ ఆడారు. హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా 29వ రోజు యాత్రలో భాగంగా నగరంలోని ఓ ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో ఓట ఆడారు. అంతేకాదు.. యువతతో పాటు పోటాపోటీగా పరుగులు పెట్టిన రేవంత్ రెడ్డి గోల్ కూడా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. అంతేకాదు.. దీనికి కేసీఆర్ ఖేల్ ఖతం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.

Also Read : Ap Assembly Session: కోటంరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన యాత్ర ఈ రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మీదుగా సాగుతుంది. గతంలోనూ ఏఎల్ఎం, ఎంసెట్ వంటి పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. కేసీఆర్ సర్కార్ వచ్చినప్పటి నుంచి 30లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహించిన పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read : Samantha: శాకుంతలం ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమంత

సిట్టింగ్ జడ్జితో అయితేనే పారదర్శకంగా విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పెద్దలు ఉండటం వల్లే టీఎస్పీఎస్సీ ఇంత వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన అన్నారు. పోలీసులైనా ఈ వ్యవహారాన్ని సుమోటాగా స్పీకరించాలి కదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ టీఎస్పీఎస్సీ చుట్టునే తిరుగుతున్నాయని ఆయన అన్నారు.

Exit mobile version