Site icon NTV Telugu

Revanth Reddy : రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాం.. అని గొప్పగా చెప్పే యాత్ర అవుతుంది

Revanth Reddy

Revanth Reddy

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్‌ 24న తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రారంభంకానుంది. అయితే.. ఈ నేపథ్యంలో.. తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మహారాష్ట్ర బృందంతో భేటీ అయ్యారు. దీనిపై రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాయ్ చూర్ నుండి మక్తల్ లోకి రాహుల్ పాదయాత్ర ఎంటర్ అవుతుందని, మహారాష్ట్ర లో నాందేడ్ లోకి ఎంటర్ అవుతుందని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌తో సమనవ్యయం కోసం ఈ సమావేశం నిర్వహించామన్నారు. క్షేత్ర స్థాయిలో సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీ వేయనున్నట్లు ఆయన తెలిపారు.

 

తెలంగాణలో పాదయాత్ర జరిగే సమయంలో పరిశీలనకు బృందం రానుందని, తెలంగాణ .. మహారాష్ట్ర నేతలతో కర్ణాటకకి బృందం వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటక.. తెలంగాణ, మహారాష్ట్ర లో పాదయాత్రనే కీలకమన్న రేవంత్‌ రెడ్డి.. దండి యాత్ర మాదిరిగా … రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుందన్నారు. అంతేకాకుండా.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాం అని గొప్పగా చెప్పే యాత్ర అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version