NTV Telugu Site icon

Mahesh Goud : మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్‌ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదు

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్‌ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సీఎంకి వ్యతిరేకంగా పెయిడ్ ప్రచారం చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని, బీఆర్‌ఎస్‌ వందల కోట్లు సోషల్ మీడియా పై పెట్టుబడి పెట్టిందని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫాం హౌస్ చుట్టూ జరిగిన అభివృద్దే.. హైదరాబాదు అభివృద్ధా? 2015_16 లో మల్లన్న సాగర్ లో 12 గ్రామాల ప్రజలను ముంచేయలేదా? పోలీసులను పెట్టీ అరెస్టులు చేయించలేదా..? అని ఆయన ప్రశ్నించారు. చేతికి వచ్చిన పంట కూడా కోసుకోకుండ చేశాడు హరీష్ అని, కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. నేరెళ్లలో దళితుల పై కేసులు పెట్టించి వేధించింది మర్చిపోయావా? నియంతలా పాలించి..ఇప్పుడు నీతులు చెప్తున్నారని ఆయన అన్నారు.

జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్స్ రాధ మరియు మూడు ముళ్ళు
అంతేకాకుండా..’రాష్ట్రాన్ని కొడుకు ఓ వైపు అల్లుడి ఇంకో వైపు..బిడ్డ మరోవైపు దోచుకున్నారు. కొండా సురేఖ పై చేస్తున్న ప్రచారం బాగుందా. పశువులు కూడా అసహించుకునే లా.. వ్యవహారం చేస్తుంది బీఆర్‌ఎస్‌, ఇంగిత జ్ఞానం ఉండాలి హరీష్..కేటీఆర్ లకు.. సోదరికి దండ వేస్తే..మీరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఇంత దిగజారుడు అవసరమా.. అధికారం లేకుంటే బతకలేరా..? కేటీఆర్ కి ఓ చెల్లి ఉంది. సురేఖ మీద అంత నీచంగా పోస్ట్ పెడితే.. ఎందుకు స్పందించలేదు. మా కార్యకర్తలు నిరసన చెప్పడానికి పోయారు. చేనేత కార్మికులు వెళ్తే.. చితక బాదారు. హైడ్రా వల్ల భయపడుతుంది బీఆర్‌ఎస్‌ నేతలు.మాజీ మంత్రులు..
ఏ చెరువు వెనక ఎవరున్నారు అనేది చర్చకు మేము సిద్ధం.. బయట పడతాం అని భయం తో brs నేతలు ఆందోళనలో ఉన్నారని’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Houthis- Israel: హౌతీలే టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు..