కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమా గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేశారు. GCC దేశాలు ఈ సినిమాకు ప్రధాన మార్కెట్ కావడంతో, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్థన మేరకు నిర్మాతలు రిలీజ్ జూన్ 4కి షిఫ్ట్ చేయడం నిర్ణయించారు.
మార్చి 8న బెంగళూరు లో ట్రైలర్ లాంచ్ కోసం గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసారు. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల కారణంగా, ఈ కార్యక్రమం రద్దు చేయబడింది. యశ్ మరియు చిత్ర నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుండి, సినిమా జూన్ 4న సొలో రిలీజ్ అవుతుంది. ఈ మార్పు అభిమానులు, సినిమాప్రేమికుల మధ్య భారీ చర్చలకు కారణమయ్యింది. యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సినిమాను సురక్షితమైన పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం.
