Site icon NTV Telugu

Toxic-movie : ‘టాక్సిక్’లో హ్యుమా ఖురేషీ.. ఆమె పాత్ర వెనుక అసలు కథ ఇదే!

Toxic Yash

Toxic Yash

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ . గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ మరియు యశ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో సందడి చేయబోతోంది. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ ను వదిలింది.

Also Read : Ranveer -Pralay: రణ్‌వీర్ సింగ్ ‘ప్రలే’లో హీరోయిన్ ఫిక్స్!

బాలీవుడ్ సీనియర్ నటి హ్యుమా ఖురేషీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె ‘ఎలిజబెత్’ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రకటించారు. ఈ పాత్ర గురించి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సినిమాలో ఎలిజబెత్ అడిగే ప్రశ్నలు చాలా లోతుగా ఉంటాయని, అవి ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయని ఆమె తెలిపారు. ఒక విభిన్నమైన మరియు బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా హ్యుమా ఈ చిత్రంలో కనిపిస్తుందని చెప్పారు. అసలు ఇలాంటి పవర్ ఫుల్ పాత్రకు ఎవరిని తీసుకోవాలో అని మొదట్లో చాలా టెన్షన్ పడ్డానని, కానీ హ్యుమా ఖురేషీ సెట్స్‌లోకి అడుగుపెట్టిన క్షణమే తన నటనతో అందరినీ ఫిదా చేసిందని గీతూ ప్రశంసల వర్షం కురిపించారు.

Exit mobile version