Site icon NTV Telugu

ACB: రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లాన్ అధికారిని

Mani Harika

Mani Harika

లంచగొండి అధికారులపై ఏసీబీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు. డబ్బు సంపాదనే లక్ష్యంగా లంచాలకు చేతులు చాపుతున్నరు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు సేవలందించాల్సిందిపోయి లంచాలు ఇవ్వాలని పీడిస్తున్నారు. లంచాలు పుచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. తాజాగా మరో అధికారిని లంచం తీసుకుంటూ దొరికిపోయింది. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Also Read:Allu Aravind : పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ అమ్మ ఏమనిపిలుస్తారో తెలుసా?

ఈ సోదాల్లో రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది టౌన్ ప్లాన్ అధికారిని మణి హారిక. భవనం అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. టౌన్ ప్లాన్ అధికారిని అదుపులోకి తీసుకొని ఏసీబీ విచారిస్తోంది. ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో మహిళా అధికారులే ఎక్కువ గా ఏసీబీకి పట్టుబడుతుండడంతో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version