Site icon NTV Telugu

Bank Holidays in November 2025: కస్టమర్లకు అలర్ట్.. వచ్చే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. ఎన్ని రోజులంటే?

Bank Holidays

Bank Holidays

ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ప్రకటించింది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయని గమనించాలి. నవంబర్ లో మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో ప్రభుత్వ సెలవులు, అలాగే రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఈ సెలవు రోజుల్లో కూడా ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Also Read:Chabahar Port: చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు అతిపెద్ద దౌత్య విజయం..

నవంబర్ లో బ్యాంకు సెలవుల జాబితా

నవంబర్ 1 (శనివారం): కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో సెలవు. అలాగే ఉత్తరాఖండ్‌లో ఇగాస్- బగ్వాల్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

నవంబర్ 2: ఆదివారం

నవరంబర్ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా పలు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

నవంబర్ 7 (శుక్రవారం): మేఘాలయాలో వంగల పండగ. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవులు.

నవంబర్ 8 (శనివారం) : రెండో శనివారం

నవంబర్ 9: ఆదివారం

నవంబర్ 11 (మంగళవారం): లహాబ్ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.

నవరంబర్ 16: ఆదివారం

నవంబర్ 22: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

నవంబర్ 23 : ఆదివారం

నవంబర్ 25: (మంగళవారం): గురు తేజ్ బహదూర్ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్, హర్యానాతోపాటు ఛండీగఢ్‌లోని బ్యాంకులన్నింటికి సెలవు.

నవంబర్ 30: ఆదివారం

Also Read:Kavitha: మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత..

Exit mobile version