NTV Telugu Site icon

Award Function : విషాదంగా అవార్డుల వేడుక.. వడదెబ్బతో 11మంది మృతి

New Project (14)

New Project (14)

Award Function : మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర భూషణ్‌-2022 అవార్డు ప్రదానోత్సవంలో ఎండ వేడి తట్టుకోలేక 11మంది చనిపోయారు. ఈ ఘటనలో మరో 120 మంది వడదెబ్బకు గురయ్యారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవీ ముంబయిలో మహారాష్ట్ర భూషణ్‌-2022 అవార్డు ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి జనం వేలాదిగా తరలివచ్చారు. ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్‌కు అవార్డును ప్రదానం చేశారు. అయితే, మిట్ట మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించడంతో అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన పలువురు సామాజిక కార్యకర్తలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Read Also: Shiva Sahasranama Stotram: సోమ ప్రదోష వ్రతం నాడు ఈ స్తోత్రం వింటే సర్వాభీష్టాలు నెరవేరుతాయి

మహారాష్ట్రలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఎండ వేడి భరించలేక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ నవీ ముంబయిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన వారికోసం సిట్టింగ్‌ ఏర్పాట్లు చేసినప్పటికీ.. పైకప్పు లేకపోవడంతో ఎండ తీవ్రతను భరించలేక 10 మంది ప్రాణాలు కోల్పోవడం,, మరో 50 మందికి పైగా వడ దెబ్బ కు గురికావడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం శిందే ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.