Award Function : విషాదంగా అవార్డుల వేడుక.. వడదెబ్బతో 11మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Award Function : మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవంలో ఎండ వేడి తట్టుకోలేక 11మంది చనిపోయారు. ఈ ఘటనలో మరో 120 మంది వడదెబ్బకు గురయ్యారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవీ ముంబయిలో మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి జనం వేలాదిగా తరలివచ్చారు. ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్‌కు అవార్డును ప్రదానం చేశారు. అయితే, మిట్ట మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించడంతో అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన పలువురు సామాజిక కార్యకర్తలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Read Also: Shiva Sahasranama Stotram: సోమ ప్రదోష వ్రతం నాడు ఈ స్తోత్రం వింటే సర్వాభీష్టాలు నెరవేరుతాయి
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మహారాష్ట్రలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఎండ వేడి భరించలేక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ నవీ ముంబయిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన వారికోసం సిట్టింగ్ ఏర్పాట్లు చేసినప్పటికీ.. పైకప్పు లేకపోవడంతో ఎండ తీవ్రతను భరించలేక 10 మంది ప్రాణాలు కోల్పోవడం,, మరో 50 మందికి పైగా వడ దెబ్బ కు గురికావడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం శిందే ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!