Post Office Schemes: మీరు బ్యాంకులో పెట్టే డబ్బుల కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇంకా అధిక వడ్డీ మీకు వస్తుంది. అవునండి.. నిజమే ప్రభుత్వ బ్యాంకుల దెగ్గర కంటే.. పోస్టు ఆఫీస్ లో మీకు అధిక వడ్డీ లభిస్తుంది. మరి ఆ పోస్టు ఆఫీస్ స్కీమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా..
ఇందులో మొదటిది టైం డిపాజిట్ స్కీమ్. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే దాన్ని బట్టి 6.9% నుంచి 7.5% వరకు మీకు ఇందులో వడ్డీ వస్తుంది. ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మినిమం రూ.1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినా వడ్డీ సంవత్సరం సంవత్సరం పడుతుంది. ఐదు సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి టాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C లో దొరుకుతుంది. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) లో మీరు డబ్బులు పెడితే ఐదు సంవత్సరాల కానీ మీ డబ్బులు లాక్ ఇన్ లో ఉంటుంది. మీరు తీయలేరు. కానీ వడ్డీ దీనికంటే కొంత ఎక్కువగా 7.7% వస్తుంది.
PM Modi: కాంగ్రెస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది: మోడీ
ఇక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నెల నెల మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఈ స్కీమ్ ద్వారా పడుతుంది. మినిమం రూ.1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ గా.. మాక్సిమం సింగిల్ గా అయితే 9 లక్షలు, జాయింట్ గా ఇద్దరు కలిసి అయితే 15 లక్షల వరకు పెట్టొచ్చు. ఆ డబ్బులకు సంబంధించిన వడ్డీ నెల నెల మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది.
ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇందులో వయసైన వాళ్ళు మినిమం 1000 రూపాయల నుంచి మాక్సిమం 30 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇందులో 8.2% వడ్డీ లభిస్తుంది. అది ప్రతి మూడు నెలలకి బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. రిటైర్ అయిన వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ కోసం బెస్ట్ స్కీమ్.
Siddipet : 8వ తరగతి విద్యార్ధినిపై తెలుగు టీచర్ ప్రణయ్ అత్యాచారయత్నం
ఇక సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల లోపు మీకు ఆడపిల్లలు ఉంటే ఇది ఖచ్చితంగా వేయాల్సిన స్కీమ్ మినిమం రూ.250 నుంచి మాక్సిమం రూ.1,50,000 వరకు సంవత్సరానికి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే దానిపైన మనకి 8.2% రిటర్న్ లెక్కన వడ్డీ క్యాలిక్యులేట్ అయి లక్షల్లో మీ అమ్మాయి పెద్దయ్యే నాటికి అది ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ ద్వారా వస్తున్న మొత్తం డబ్బులు టాక్స్ ఫ్రీ అండ్ అన్ని స్కీమ్స్ కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరోసా ఉంటుంది.
